Chủ Nhật, 9 tháng 6, 2013

youtube నుంచి వీడియో download చేసుకోవాలా




              యూట్యూబ్ అంటే యూత్‌కు వీడియో పండగ అన్నమాటే. యూట్యూబ్‌ లోవీడియో ఏదైనా మీకు తెగనచ్చేసిందనుకోండి. దాన్ని (download)డౌన్‌లోడ్ చేసుకొనేంతదాకా నిద్ర పట్టదిక. కదూ! ఎఫ్‌ఎల్‌వి (FLV)వాటిద్వారా సేవ్ చేసుకోవచ్చు. తిరిగి ప్లే చేసుకోవచ్చు. అలాగే సేవ్‌టు పీసీఅనే సాఫ్ట్‌వేర్ ఒకటి ఉంది.  సేవ్ టు పీసీ లైట్ అనే వెర్షన్ పూర్తి ఫ్రీవేర్. దీనిద్వారా డౌన్‌లోడ్ చేయాలనుకొన్న వీడియో యుఆర్‌ల్ ఇస్తేచాలు. ఇట్టే డౌన్‌లోడ్ అవుతుంది. Savezpc light. ధీనియుఆర్‌ఎల్ ఇది: http://savezpc.com/ ఇది మరో సైట్‌లోకూడా లభిస్తుంది. దాని యుఆర్‌ఎల్ ఇది: http://savezpc.లోSoftonic.com ఈ సైట్లు అడ్రస్‌లు గుర్తుంచుకోవడం సమస్యఅనుకొంటే గూగుల్ లోకెళ్ళి Savezpc అని గానీ, how to savevideo from Yutube అని గాని సెర్చి చేయండి. Savezpcఒక్కటే కాదు. బోలెడు ఇతర సాఫ్ట్‌వేర్‌లూ లభిస్తున్న వాటి లింక్స్ దొరుకుతాయి.
 some of the top youtube downloader are :
1.www.orbitdownloader.com 
2.keepvid.com/
3.keep-tube.com  
4.YTD Video Downloader http://www.ytddownloader.com/ 

Thứ Bảy, 11 tháng 5, 2013

ఆధార్ కార్డు (Aadhaar Card)


 ఆధార్ కార్డు అంటే ?
ఆధార్...సామాన్యుని హక్కు
బయోమెట్రిక్ కార్డుల వల్ల ఎవరైనా... ఎక్కడైనా...ఠక్కున గుర్తించవచ్చు. ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో 'జాతీయ జనాభా రిజిస్టర్' తయారీ, 'జాతీయ పౌరగుర్తింపు కార్డు లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇంటింటికీ తిరిగి వేలి ముద్రలు ఫొటోలు నమోదు చేసి గుర్తింపు కార్డులు రూపొందిస్తారు.

దేశ పౌరులందరికీ 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యనిచ్చి ‘ఆధార్‌’ కార్డ్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వం ఫిబ్రవరి 2009లో నిర్ణ యించింది. పేదరికాన్ని నిర్మూలిం చడం, ఉగ్రవాదాన్ని అణిచి వేయడం, ప్రభుత్వ పథకాలు, ఇన్స్యూరెన్స్‌, బ్యాంక్‌ లావాదేవీలు, ఉద్యోగాలు, ఇతరాలు సకాలంలో అసలెైన వ్యక్తులకు అందేలా చూడడం ఆధార్‌ కార్డు ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు మన పాల కుల మస్తిష్కంలో పుట్టింది కాదు. ఇ- ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఇనీషియే టివ్‌గా ఈ ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు ప్రవేశపెట్టి, వర్ధమాన దేశాలు అనుసరించేలా చూస్తోంది. ప్రపంచబ్యాంకు విధానాలకు తలఒగ్గే మన పాలకులు అభివృద్ధి పేరిట ఈ ప్రాజెక్టు అమలుకు ఒప్పుకున్నారు. మన దేశంలో ఆధార్‌కార్డు ప్రాజెక్టు అమలుకు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకోవడానికి, అభివృద్ధి పరచడా నికి అమెరికా సంస్థలు కాంట్రాక్టులు పొందాయి.


మొన్న రేషన్ కార్డు! నిన్న గుర్తింపు కార్డు! నేడు ఆధార్  కార్డు! మరి రేపేమిటొ? ప్రజల బ్రతుకిక త్రిశంకు స్వర్గామేనా ? ఏ దేశమేగినా ఎందుకాల్లిడిన పొగడరా  నీ తల్లి భూమి భారతిని! అన్నాడు గురజాడ.  ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా ప్రజలకు తప్పవు కస్టాలు అంటున్నాయి మన ప్రభుత్వాలు. రేషన్ కార్డు లేకుంటే గుప్పెడు మెతుకులు కూడా దొరకవు అనే స్థాయి నుండి ఆధార్  కార్డు లేకుంటే వండుకోవడానికి గ్యాస్ కూడా కష్టం  అనే స్థాయి కి పెరిగాయి ప్రజల తిప్పలు . 

ఇకపై ఉప్పు కావాలన్నా..పప్పు కావాలన్నా..గాస్ కావాలన్నా..బ్యాంక్ అకౌంటు తెరవాలన్నా...  అన్ని నిత్యావసరాలకి ...దేనికయినా ఆధారం ఇదే...మీరు మీరే అనటానికి ఇకనుండి ఋజు పత్రం (identity proof) ఇదే

ఆధార్‌ కార్డు పుట్టుకకు నేపథ్యం ఏమిటి ?
భారతదేశంలో ప్రజలకు గుర్తింపు ఇవ్వటం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్ట్రార్‌(http://ditnpr.nic.in/), ఎన్నికల సంఘం ద్వారా ప్రజలందరికీ గుర్తింపు కార్డు ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలలో రేషన్‌ కార్డు(http://www.apcivilsupplies.gov.in/)లను ఇస్తున్నాయి. బోగస్‌ కార్డులున్నాయనే పేరుతో ఐరిష్‌ టెక్నాలజీతో కూడా కార్డులను ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి పోందే ఏ పథకానికైనా, ఉద్యోగం, స్కాలర్‌షిప్పులు, సర్టిఫికెట్లు, ఇతర అవసరాలకు పై కార్డులనే ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రాతిపదికగా తీసుకుంటోంది. ఆ కార్డులు ఉండగానే ఆధార్‌ కార్డును ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

ఆధార్ ఇలా పొందొచ్చు..

‘యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) సంస్థ ద్వారా జారీ అయ్యే ఈ కార్డులను ప్రతి భారత పౌరుడికీ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనంది. . ఆధార్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని రాష్ట్రంలోని అన్ని పంచాయతీ కేంద్రాలు, జిల్లాలోని ఇతర కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు అధికారులు సమాచారాన్ని అందిస్తారు. అప్పుడు ఫొటోతో ఉన్న ఏదైనా గుర్తింపు పత్రాన్ని, నివాస ధ్రువీకరణ పత్రాన్ని తప్పకుండా తీసుకెళ్లాలి. ఏ కార్డు లేకపోతే ఎవరైనా ఆధార్ గుర్తింపు అధికారి నుంచి సహకారాన్ని పొందొచ్చు.

అక్కడ ఇచ్చే ఆధార్ ఫారంలో పేరు, పుట్టినతేదీ, లింగం, చిరునామాలను నమోదు చేసి గుర్తింపును తెలియజేసే ఐడెంటిటీ కార్డు జిరాక్స్‌ను పొందుపరచి అధికారులకు అందజేయాలి. తర్వాత బయోమెట్రిక్ విధానం ద్వారా శారీరక గుర్తులను అధికారులు నమోదు చేసుకుంటారు. ఇందులో భాగంగా వ్యక్తులను ఫొటో తీయడంతో పాటు కళ్లను ఐరిస్ చేస్తారు. వేలి ముద్రలను సైతం నమోదు చేస్తారు.

ఆన్లైన్ లో ఆధార్ కార్డు(Aadhaar card Online)

చాలా కాలంగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని, కార్డు అందని వారు అధికార వెబ్ సైట్ నుండి కార్డు సమాచారానికి సంబంధించిన వివరాలను ప్రింట్ తీసుకొని, దానిని ఆధార్ కార్డు తప్పనిసరి కార్యకలాపాలకు ఆధారంగా చూపవచ్చు

ఆధార్ కార్డు వెబ్సైట్ నుండి ఈ వివరాల పేపర్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆధార్ కార్డు దరఖాస్తు నెంబర్ మరియు దరఖాస్తు చేసుకున్న తేదీ, సమయం తప్పనిసరిగా ఉండాలి(Enrolment No. and Date time ). ఈ వివరాలను పొందు పర్చిన తరువాతనే ఆధార్ కార్డుకు సంభంధించిన పూర్తి వివరాల పేపర్ తీసుకోవచ్చు.

ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే పూర్తి విధానం ఈ క్రింది విధంగా:

ఇప్పుడు ప్రభుత్వం ఆధార్ కార్డులను  ఇంటర్‌నెట్‌లో పొందే సౌలభ్యం కల్పించింది. ఆధార్ కార్డు రానివారు. http://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం యూఐడీఏఐ కల్పించింది
  1. మీ ఆధార్ కార్డు దరఖాస్తు నెంబరు, తేదీ, సమయం దగ్గరు ఉంచుకోండి. ఈ వివరాలు మీ దరఖాస్తు చేసిన సమయంలో ఇచ్చిన రశీదు లో పొందుపర్చి ఉంటుంది.(Enrollment No.)
  2. వెబ్సైట్ లో మీ పేరు, పిన్ కోడ్, దరఖాస్తు నెంబర్, తేదీ, సమయం పొందు పర్చి “సబ్మిట్”(Submit) చేయండి.
  3. అనంతరం మీ మొబైల్ నంబర్ పై 4 అంకెల ఒక సంఖ్య(OTP) వస్తుంది. ఈ సంఖ్య ను వెబ్సైట్ లో నిర్దేశిత ప్రదేశంలో వ్రాసి “యెస్(yes) ” ని ఎంచుకోండి. అనంతరం మీ మొబైల్ పై ఒక రహస్య పాస్వర్డ్ వస్తుంది.
  4. ఈ పాస్ వర్డ్ ను నిర్దేశిత ప్రదేశంలో పొందుపర్చి న వెంటనే కంప్యూటర్ లో మీ ఆధార్ కార్డు లేఖకు సంబంధించి ఒక “లింక్” వస్తుంది. ఆ లింక్ ను క్లిక్ చేసి ఆధార్ కార్డు సంబంధించిన వివరాల లేఖను పొందవచ్చు. ఈ లేఖను పొందేందుకు మీ ప్రాంత పిన్ కోడ్ పొందుపర్చవాల్సి ఉంటుంది.                                          

    ఆధార్ కార్డు వివరాలు మార్చుకోవడం ఎలా ? 

    5.ఆధార్ కార్డులో వివరాలు నమోదు చేసేటప్పుడు కొన్ని తప్పులు (Errors)ఉండి ఉండొచ్చు. వాటిని కూడా నేరుగా వెబ్‌సైట్‌(Website) లోనే సరిచేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ వెబ్‌సైట్‌లో కుడివైపు (right side) ఉన్న

     ‘అప్‌డేట్ యువర్ ఆధార్ డేటా’update your Aadhaar data'

     http://uidai.gov.in/update-your-aadhaar-data.html 

    అనే లింకును క్లిక్ చేయాలి.

     

    6.మీ ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేస్తే.. అప్పుడు మొబైల్ ఫోనుకు పాస్‌వర్డ్ (Password) వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే స్క్రీన్ మీద మార్చడానికి వీలున్న వివరాలన్నీ కనిపిస్తాయి.అయితే.. చిరునామా(Address), పుట్టిన తేదీ (Date of Birth) లాంటి వివరాలు మార్చాలంటే మాత్రం అందుకు సంబంధించిన ఆధారాల(Documents)ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ (upload)చేయాల్సి ఉంటుంది.

    https://portal.uidai.gov.in/updatePortal/home.action 

     

      7.అలా చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. తర్వాత కొత్త ఆధార్ కార్డును పోస్టులో పంపుతారు. ముందుగా వెబ్‌సైట్‌లో వచ్చే ఈ కార్డును కూడా ప్రింటవుట్ తీసుకుని ఉపయోగించుకోవచ్చు.

    8.ఆధార్ కార్డు SMS ద్వార :

    Type
     UID STATUS <14 Digit EID>
    and send it to
    51969

      if your enrollment number is 1001/15161/01426, then  send

    UID STATUS 10011516101426
    to
    51969

 లాభాలు (Advantages)


1.ప్రావిడెంట్ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాను ఆధార్‌ కార్డుతో ముడిపెట్టిందీ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. తమ ఖాతా దారులకు ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది. 
2.ఆధార్ వుంటేనే పథకం అమలు
3.గ్యాస్ కనెక్షన్‌(Gas connection) కు ఆధార్ కార్డు నెంబర్ 
4.సబ్సిడీల వర్తింపుకు ప్రభుత్వం ఆధార్ కార్డు తప్పని సరి
5.ఉపాధి హామీ పథకానికి ఆధార్‌,ఆరోగ్య సేవలు పొందాలన్నా.. పిల్లాణ్ని బళ్లో చేర్చాలన్నా
6.ప్రతి కుటుంబానికి ఆధార్‌ కార్డు,మొబైల్ కనెక్షన్ కోసం
7.ఆధార్‌ కార్డు లేకపోతే రేషన్‌ మాత్రమే కాదు వంటగ్యాస్‌, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, ముఖ్యమయిన డాక్యుమెంట్ల సమర్పణ వంటివి కుదరవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి
8.ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ల కోసం వి ద్యార్థులకు తప్పనిసరి చేసిన ఆధార్ కార్డు

UIDAI Helpline

  • Telephone – 1800-180-1947
  • Fax – 080-2353 1947
  • Letters – PO Box 1947, GPO Bangalore - 560001
  • Email - help@uidai.gov.in

Thứ Bảy, 4 tháng 5, 2013

How to create a free website --- ఉచితంగా వెబ్సైటు క్రేయట్ చేయవచ్చా ?

                          ప్రస్తుత కాలంలో ప్రతీ సంస్థ కు website అనేది తప్పని సరి అయ్యింది. సంస్థ ఉనికి ప్రపంచానికి
 చాటడానికి ,తన వ్యాపారాన్ని విస్తరిమ్చుకోవడానికి Website అనేది ఎంతో దోహదం చేస్తుంది. అయితే ప్రతి సంస్థ తన Website ను నిర్వహించుకోవడానికి ప్రతీ Year కొంత మొత్తం వేచ్చిమ్చక తప్పదు. Website Domain Registration ,వెబ్సైటు హోస్టింగ్చెయ్యడానికి కూడా నిర్వహణ వ్యయం అవుతుంది . (డొమైన్ అంటే వెబ్సైటు పేరు ఉదాహరణకుహోస్టింగ్ అంటే వెబ్సైటు లో ఉండే పేజీలు ,ఫైల్స్ అన్ని ఒక సర్వర్ లోఉంచి అక్కడ నుండి ఆన్ లైన్ లో ఉంచడం ). www.eenadu.net,www.sakshi.com), అయితే పెద్ద పెద్ద సంస్థలు ఈ ఖర్చులు భరిస్తాయి .కానీ చిన్న చిన్న షాప్స్ ,స్వయం ఉపాది సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి అనుకొనేవారు ఎటువంటి ఖర్చు లేకుండా Website Create చేసుకోవచ్చు. వీరి అవసరాలకు సరిపోయేవిదం గా కొన్ని Website లు Free గా పేజీలను కేటాయిస్తున్నాయి .
ఉదాహరణకు www.webs.com ,www.freeservers.com

ఈ వెబ్సైటు లో కి వెళ్లి మన ఈమెయిలు తో లాగిన్ అయ్యి అక్కడ ఉన్న టూల్స్ తో వెబ్ పేజీలను Create చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి సాంకేతిక నైపుణ్యం ఆవసరం లేదు . మనకు సొంత Domain కావాలి అనుకొంటే మాత్రం Domain కొరకు సుమారు 500 /- రూపాయలు చెల్లిమ్చావలిసి ఉంటుంది (www.yourname.com).లేని యెడల సబ్ డొమైన్ తోఅంటే (www .yourname .webs .com ) తో ఫ్రీ గా Website Create చేసుకోవచ్చు .

ఈ వెబ్ పేజీలలో మనకు కావలిసిన టెక్స్ట్(Text) ,చిత్రాలు(Pictures) ,లింక్(Links) లు కూడా పెట్టుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి .అలాగేమనకు కావలిసిన థీమ్స్(Themes) కూడా ఎంచుకోవచ్చు http://www.freeservers.com/ అయితే మన ఫ్రీ వెబ్సైటు తో పాటు గా mailbox ను కూడా ఇస్తుంది . 

మనకు ఫ్రీ గా ఇస్తే వారికీ లాభం ఏమిటి ?

ఈ వెబ్సైటు లు మనకు వెబ్ పేజీలను ,మెయిల్ బాక్స్ లను ఇవ్వడమే కాదుమనద్వారా ఆదాయాన్ని కూడా పొందుతాయి .మనం క్రేఅట్ చేసుకొన్న పేజీలలోఇవి యాడ్స్ పెట్టుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందుతాయి 

వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేసి Lookup అనే బటన్‍ని క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి..

నేడు వెబ్‌ డిజైనింగ్‌ అనేది ఓ కళగా మారింది. వెబ్‌ డిజైనర్లు తమ ఆలోచనా శక్తితో ఎంతో సృజనాత్మకంగా పలు రకాల వెబ్‌సైట్‌లను తీర్చిదిద్దుతున్నారు. సైట్‌లోని హోమ్‌ పేజీతో పాటు వివిధ రకాల పేజీలను అందంగా మలచే పని ని వెబ్‌ డిజైనర్లు చూసుకుంటున్నారు. వెబ్‌ డిజైనర్లు వెబ్‌ డెవలపర్లతో కలిసి వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసి దాన్ని అభివృద్ది పరుస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ డాక్యు మెంట్లు, అప్లికేషన్స్‌ను రూపొందిస్తూ వెబ్‌సైట్‌ పేజీలను ఆకర్షణీయంగా మలుస్తున్నారు. అత్యాధునిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పేజీలలో స్పెషల్‌ ఎఫెక్ట్‌‌సను సృష్టిస్తున్నారు. వెక్టార్‌ గ్రాఫిక్స్‌, యానిమేషన్‌, వీడియోస్‌, సౌండ్స్‌ను వినియోగిస్తూ సైట్‌ పేజీలను ఆకట్టుకునేవిధంగా రూపొందిస్తున్నారు. అడోబ్‌ ఫ్లాష్‌, క్విక్‌ టైమ్‌, జావా వంటి సాఫ్ట్‌వేర్‌లను డిజైనర్లు వినియోగిస్తున్నారు. నేడు వెబ్‌ డిజైనర్లు సైట్‌లో స్టాటిక్‌, డైనమిక్‌ పేజీలను రూపొందిస్తున్నారు. స్టాటిక్‌ పేజీలలలో సమాచారాన్ని రోజూ మార్చకుండా ఎప్పుడో ఒకసారి మారుస్తుంటారు. వెబ్‌పేజీ లేఅవుట్‌, డిజైనింగ్‌లో కూడా పెద్దగా మార్పు ఉండదు. డైనమిక్‌ పేజీలలో సమాచారాన్ని ప్రతి రోజు మారుస్తుం టారు. ఉదాహరణకు వివిధ డైలీ న్యూస్‌ పేపర్లు ఏర్పాటు చేసుకున్న వెబ్‌సైట్లలో రోజంతా వివిధ రకాల సమాచారాన్ని పొందుపరుస్తూ పాత సమాచారాన్ని తొలగిస్తుంటారు. రోజు, రోజుకూ కొత్త ఫొటోలను సైట్‌లో పొందుపరుస్తుంటారు.

వెబ్‌ డెవలపింగ్‌లో నేడు యానిమేషన్‌, ఆథరింగ్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, కార్పోరేట్‌ ఐడెంటిటీ, గ్రాఫిక్‌ డిజైన్‌, హ్యూమన్‌ కంప్యూటర్‌ ఇంటరాక్షన్‌, ఇన్‌ఫర్మేషన్‌ ఆర్కిటెక్చర్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌, మార్కెటింగ్‌, ఫొటోగ్రఫీ, సెర్చ్‌ ఇంజైన్‌ ఆప్టిమైజేషన్‌, టైపోగ్రఫీ వంటి వాటిని వినియోగిస్తున్నారు. వెబ్‌డి జైనింగ్‌లో హెచ్‌టిఎంఎల్‌, ఎక్స్‌హెచ్‌ టిఎంఎల్‌, ఎక్స్‌ఎంఎల్‌ వంటి మార్క్‌అప్‌ లాంగ్వేజెస్‌, సిఎస్‌ఎస్‌, ఎక్స్‌ఎస్‌ఎల్‌ వంటి స్టైల్‌ షీట్‌ లాంగ్వేజెస్‌, జావా స్క్రిప్ట్‌ వంటి క్లైంట్‌ సైడ్‌ స్క్రిప్టింగ్‌, పిహెచ్‌పి, ఎఎస్‌పి వంటి సర్వర్‌ సైడ్‌ స్క్రిప్టింగ్‌, మైైఎస్‌ క్యూఎల్‌, పోస్ట్‌గ్రేఎస్‌ క్యూఎల్‌ వంటి డాటాబేస్‌ టెక్నాలజీస్‌, ఫ్లాష్‌, సిల్వర్‌ లైట్‌ వంటి మల్టీమీడియా టెక్నాలజీస్‌ను వినియోగిస్తూ సైట్‌ పేజీలను రూపొందిస్తున్నారు. ఇక వెబ్‌ డిజైనింగ్‌ గురించి మొదట తెలియజేసింది టిమ్‌ బెర్నెర్స్‌లీ. ఆయన 1991 ఆగస్టులో వెబ్‌ డిజైనింగ్‌ గురించి ఓ పుస్తకాన్ని రాశారు. ఆయన ఇంటర్నెట్‌, వెబ్‌సైట్‌లు, సైట్‌ల డిజైనింగ్‌ తదితరాల గురించి ఇందులో వివరించారు.

వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌...
worldఎవరైనా సరే ఇంటర్నెట్‌లో సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవడం చాలా సులభంగా మారింది. నేడు వెబ్‌సైట్‌లు డాట్‌ కామ్‌, డాట్‌ ఇన్‌, డాట్‌ నెట్‌, డాట్‌ ఒఆర్‌జిలతో ఏర్పడుతున్నాయి. ఏవైనా సంస్థలు, వ్యక్తులు సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు వెబ్‌డెవలపింగ్‌, డిజైనింగ్‌ సంస్థలను సంప్రదిస్తున్నారు. ఈ సంస్థలు వెబ్‌సైట్‌ను ప్రారంభించడం మొదలుకొని వాటి డిజైనింగ్‌, అప్‌లోడింగ్‌ వంటివన్నింటినీ చూసుకుంటున్నాయి. ఇక ఎవరైనా ఏదైనా పేరుతో నెట్‌లో వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు నేడు నెట్‌లో ఓ వెబ్‌సైట్‌ ఉండడం విశేషం. www.godaddy.com లోకి వెళ్లి అందులో కొత్తగా ఎవరైనా వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌ను క్రియేట్‌చేసుకునే సౌకర్యం ఉండడం విశేషం. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలకు అనుగుణంగా వివిధ మొత్తాలను చెల్లించి వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌ను కొనుగోలుచేయవచ్చు. ఇందుకుగాను 600రూ.ల నుంచి రెండు,మూడు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక ఇంటర్నెట్‌లో స్పేస్‌ను కొనుగోలుచేసేందుకు వెబ్‌ హోస్టింగ్‌సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. సైట్‌లోని వివిధ పేజీలను ఏర్పాటుచేసుకునేందుకు ఈ స్పేస్‌ అవసరమవుతుంది. ఇందులో 1 జిబి, 2 జిబిలు మొదలుకొని అన్‌లిమిటెడ్‌ స్పేస్‌ నేడు నెట్‌లో అందుబాటులో ఉంది. ఇందుకుగాను వేయి రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ స్పేస్‌ కొనుగోలు అనంతరం వెబ్‌డిజైనర్లు, వెబ్‌ డెవలపర్లు కలిసి వెబ్‌సైట్‌ను డెవలప్‌ చేస్తారు. వెబ్‌సైట్‌లోని పేజీలను వెబ్‌ డిజైనర్‌ రూపొందిస్తూ ఆ పేజీలకు సంబంధించిన ప్రోగ్రామ్‌, కోడింగ్‌, అప్లికేషన్స్‌ వంటి వాటిని వెబ్‌ డెవలపర్‌ రూపొందిస్తాడు. వెబ్‌ డిజైనర్లు, డెవలపర్లు సమిష్టిగా పనిచేస్తూ వెబ్‌సైట్‌లోని పేజీలలో సమాచారం, ఫొటోలను రోజు మార్చడం, ఫ్లాష్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తూ ప్రత్యేక సమాచారం, అడ్వర్టైజ్‌మెంట్లను రూపొందించడం వంటివి నిర్వహిస్తారు.

సొంతంగా వెబ్‌సైట్‌...
ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసుకోవడం నేడు చాలా సులభంగా మారింది. ముందుగా డొమైన్‌ నేమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన అనంతరం నెట్‌లో స్పేస్‌ కొనుగోలుచేస్తే చాలు సైట్‌ ప్రారంభమైనట్టే. వివిధ సంస్థలు, వ్యక్తులు వెబ్‌సైట్‌లో అవసరమైన మేరకు పేజీలను రూపొందించాలని చెబితే దాని ప్రకారం వెబ్‌ డిజైనింగ్‌, డెవలపింగ్‌ కొనసాగుతుంది. నేడు అందుబాటులో ఉన్న హెచ్‌టిఎంఎల్‌, ఎక్స్‌హెచ్‌టిఎంఎల్‌, ఎక్స్‌ఎంఎల్‌ వంటి మార్క్‌అప్‌ లాంగ్వేజెస్‌, సిఎస్‌ఎస్‌, ఎక్స్‌ఎస్‌ఎల్‌ వంటి స్టైల్‌ షీట్‌ లాంగ్వేజెస్‌, జావా స్క్రిప్ట్‌ వంటి క్లైంట్‌ సైడ్‌ స్క్రిప్టింగ్‌, పిహెచ్‌పి, ఎఎస్‌పి వంటి సర్వర్‌ సైడ్‌ స్క్రిప్టింగ్‌, మైైఎస్‌క్యూఎల్‌, పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్‌ వంటి డాటాబేస్‌ టెక్నాలజీస్‌, ఫ్లాష్‌ , సిల్వర్‌లైట్‌ వంటి మల్టీమీడియా టెక్నాలజీస్‌ను వినియోగిస్తూ వెబ్‌సైట్‌ను పూర్తిగా డెవలప్‌ చేయడం జరుగుతుంది. నేడు పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో పాటు పలువురు వ్యక్తులు సొంతంగా వెబ్‌సైట్‌లను రూపొందించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.